అల్లు సినిమాస్ తెచ్చిన సరికొత్త ఎక్స్ పీరియన్స్ తో రాబోతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”

అల్లు సినిమాస్ తెచ్చిన సరికొత్త ఎక్స్ పీరియన్స్ తో రాబోతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”

Published on Mar 13, 2026 2:03 PM IST

allu cinemas 1

ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ డాల్బీ సినిమా స్క్రీన్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ లు మన హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. అయితే ఇందులో ఆడియెన్స్ కి అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ని తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసి లేటెస్ట్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ డాల్బీ వెర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ని తీసుకొస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని ఒక పర్ఫెక్ట్ డాల్బీ సినిమాస్ ఎక్స్ పీరియన్స్ ని చేయాలి అంటే ఇక్కడ డెఫినెట్ గా చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఫ్యాన్స్ కి ఇదొక చక్కటి అవకాశం. సో ఈసారి పెర్ఫార్మన్స్ మాత్రమే కాదు ఎక్స్ పీరియన్స్ కూడా బద్దలైపోద్ది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మార్చ్ 19న ఉగాది కానుకగా ఈ సినిమా రాబోతుంది.

తాజా వార్తలు