Oscars 2026: 98వ అకాడమీ విన్నర్స్ లిస్ట్ ఇదే..!

Oscars 2026: 98వ అకాడమీ విన్నర్స్ లిస్ట్ ఇదే..!

Published on Mar 16, 2026 10:09 AM IST

OSCARS

వరల్డ్ సినిమా దగ్గర ఫీల్మ్ మేకర్స్ తమ లైఫ్ టైం లో ఒక్కసారైనా ఈ అవార్డు రావాలని కోరుకునే ప్రఖ్యాత అవార్డునే ‘ఆస్కార్స్'(Oscars). మరి ప్రతీ ఏడాది లానే ఈసారి కూడా ఆస్కార్స్ కి ఆసక్తికర సినిమాలు అది కూడా ఎన్నడూ లేని విధంగా పలు సినిమాలు అత్యధిక విభాగాల్లో కూడా నామినేట్ అయ్యాయి. అందుకే ఈసారి ఏ సినిమాలు, దర్శకులు ఇతర టెక్నీషియన్స్ గెలుచుకుంటారా అని ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా ఇప్పుడు ఈ లిస్ట్ బయటకి వచ్చేసింది.

2026 ఆస్కార్ విజేతల వివరాలు ఇవే

ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (One Battle After Another)

ఉత్తమ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (Sinners)

ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (Hamnet)

ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (One Battle After Another)

ఉత్తమ సహాయ నటి: అమీ మాడిగన్ (Weapons)

ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (One Battle After Another)

ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (Sinners)

అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ ఆండర్సన్ (One Battle After Another)

ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: కె-పాప్ డీమన్ హంటర్స్ (KPop Demon Hunters)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్ (Mr. Nobody Against Putin)

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వ్యాల్యూ – నార్వే (Sentimental Value)

ఎడిటింగ్: ఆండీ జుర్గెన్సెన్ (One Battle After Another)

సినిమాటోగ్రఫీ: ఆటం డ్యూరల్డ్ అర్కాపా (Sinners)

ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గోరాన్సన్ (Sinners)

కాస్టింగ్: కాసాండ్రా కులుకుండిస్ (One Battle After Another)

ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైన్ (Frankenstein)

కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హావ్లీ (Frankenstein)

విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash)

సౌండ్: F1: ద మూవీ (F1: The Movie)

మేకప్ మరియు హెయిర్‌స్టైలింగ్: ఫ్రాంకెన్‌స్టైన్ (Frankenstein)

ఒరిజినల్ సాంగ్: “గోల్డెన్” (KPop Demon Hunters)

లైవ్-యాక్షన్ షార్ట్: ది సింగర్స్ మరియు టూ పీపుల్ ఎక్స్ఛేంజింగ్ సెలైవా (The Singers and Two People Exchanging Saliva) – టై

డాక్యుమెంటరీ షార్ట్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్ (All the Empty Rooms)

యానిమేటెడ్ షార్ట్: ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్ (The Girl Who Cried Pearls)

ఇలా 98వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లో అనేక చిత్రాలు, టెక్నీషియన్స్ గెలుపొందారు. ఊహించిన విధంగానే సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ సినిమాలు ఎక్కువ అవార్డ్స్ తో పోటాపోటీగా షైన్ అయ్యాయి. అలాగే ఫ్రాంకెన్స్టైన్ కూడా అదరగొట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు