ముఖ్య అంశాలు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళ నటుడు పార్తీబన్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- పవన్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఏపీ ముఖ్యమంత్రి అవుతారని, ఆ రోజు కోసం జనం పూలబొకేలతో ఎదురుచూస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- ఈ కామెంట్స్ విని అభిమానులు కేకలు వేస్తుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హావభావాలు పలకకుండా సైలెంట్‌గా ఉండిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా ఈవెంట్ అయినా సరే.. ఎక్కడో ఒకచోట రాజకీయాల ప్రస్తావన రావడం ఈమధ్య కామన్ అయిపోయింది. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఏకంగా పవన్ సీఎం అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ కామెంట్స్‌కి పవన్ రియాక్ట్ అయిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్.. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ వేదికపై మాట్లాడుతూ ఆయన పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి ఊహించని కామెంట్స్ చేశారు. “భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు వస్తే ప్రజలంతా చేతుల్లో బొకేలు పట్టుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతారు” అంటూ పార్తీబన్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఒక పక్క స్టార్ యాక్టర్ ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంతో.. అక్కడున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేజ్ దద్దరిల్లేలా అరుపులు, కేకలతో హోరెత్తించారు. అయితే ఈ వేడుకలో తన గురించి, తన రాజకీయ ప్రయాణం గురించి ఇంత డైరెక్ట్‌గా కామెంట్స్ రావడం బహుశా పవన్‌కు కాస్త అసౌకర్యంగా అనిపించిందేమో. ఫ్యాన్స్ అంతా రచ్చ చేస్తున్నా.. పవన్ మాత్రం చాలా సైలెంట్‌గా ఉండిపోయారు. నవ్వడం గానీ, పక్కనున్న వారితో మాట్లాడటం గానీ చేయలేదు. ఆయన ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేదు. జస్ట్ అలా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయారు.
సాధారణంగా తనను ఎవరైనా పొగిడితే పవన్ ఎప్పుడూ కాస్త మొహమాటపడతారు. ఇప్పుడు కూడా ఆ కామెంట్స్‌ను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక సైలెంట్ అయ్యారని కొందరు అంటుంటే.. రాజకీయాల్లోకి వెళ్ళాక ఇలాంటివి సహజమే అని ఆయన లైట్ తీసుకున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా పార్తీబన్ మాటలు పవన్ అభిమానుల్లో కొత్త జోష్ నింపాయనేది మాత్రం వాస్తవం.


