‘బైకర్’ సాంగ్స్ పై షాకింగ్ రివీల్.. ఏకంగా 8..!

‘బైకర్’ సాంగ్స్ పై షాకింగ్ రివీల్.. ఏకంగా 8..!

Published on Mar 17, 2026 11:56 AM IST

Biker

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన గిబ్రాన్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ‘సాహో’ తర్వాత తనకిది ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. దర్శకుడు అభిలాష్ చెప్పిన కథలోని ఎమోషన్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని, స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని ఆయన పేర్కొన్నాడు.

​టెక్నికల్ పరంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని గిబ్రాన్ తెలిపాడు. హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు, హృదయాన్ని హత్తుకునే కుటుంబ అనుబంధాల కలయికతో ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పాడు. ముఖ్యంగా తండ్రి-కొడుకుల మధ్య ఉండే బాండింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, శర్వానంద్ తన నటనతో అందరినీ మెప్పిస్తారని ఆయన వెల్లడించాడు.

​సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో 5 లేదా 6 పాటలు ఉంటాయి. కానీ ‘బైకర్’ చిత్రంలో మొత్తం 8 పాటలు ఉండటం విశేషం. ఇందులో ఒక పూర్తి స్థాయి పాటతో పాటు, మిగిలినవన్నీ కథలో భాగంగా వచ్చే మాంటేజ్ సాంగ్స్ అని గిబ్రాన్ స్పష్టం చేశాడు.

తాజా వార్తలు