మెగా ప్రాజెక్ట్ పై హరీష్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఆఫీషియల్ క్లారిటీ..!

మెగా ప్రాజెక్ట్ పై హరీష్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఆఫీషియల్ క్లారిటీ..!

Published on Mar 17, 2026 11:01 AM IST

Chiru and Harish

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్, మెగాస్టార్ చిరంజీవితో మూవీ పై తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మార్చి 19, 2026న ఉగాది కానుకగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, చిరంజీవితో ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు.

చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కనుందని ఆయన భరోసా ఇచ్చాడు. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. వింటేజ్ చిరంజీవిని వెండితెరపై చూపిస్తానని హామీ ఇచ్చాడు. ముఖ్యంగా ‘రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాల్లో చిరంజీవి పండించిన మాస్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు.

“మెగాస్టార్‌ను ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటారో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మెగాస్టార్, హరీష్ శంకర్ ఇద్దరూ మాస్ ఎంటర్టైనర్లను అందించడంలో సిద్ధహస్తులు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పనుల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాజా వార్తలు