ఈ ఉగాది బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఆల్రెడీ మొదలైంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన టేకోవర్ చూపిస్తున్నారు. రిలీజ్ కి ముందు వరకు చాలానే కామెంట్స్, ఇబ్బందులు కనిపించినప్పటికీ డే 1 కి వచ్చేసరికి మాత్రం పవన్ స్టార్ పవర్ డ్యూటీ చేస్తుంది.
మెయిన్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ లో సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి కనిపిస్తున్నాయి. ఏపీలో టికెట్ ధరలు హైక్స్ ఉన్నప్పటికీ మొదటి రోజు సింగిల్ స్క్రీన్స్, వైజాగ్ లాంటి సిటీ లలో సింగిల్ స్క్రీన్స్ సహా ఐనాక్స్ లలో హౌస్ ఫుల్స్ పడిపోయాయి.
మరి ఇదే మూమెంటంలో సినిమాకి ఒక్క పాజిటివ్ టాక్ కూడా పడితే మాత్రం థియేటర్స్ కి ఈ ఉగాది బరిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. సో కంటెంట్ పరంగా సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే మరికొంత సమయం ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ ,మేకర్స్ నిర్మాణం వహించారు.


