సమీక్ష: ఉస్తాద్ భగత్ సింగ్ – ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ కి ఓకే అనిపించే మాస్ ఎంటర్టైనర్

సమీక్ష: ఉస్తాద్ భగత్ సింగ్ – ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ కి ఓకే అనిపించే మాస్ ఎంటర్టైనర్

Published on Mar 19, 2026 2:03 PM IST

Ustaad Bhagat Singh Review

విడుదల తేదీ : మార్చి 19, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, రావు రమేష్, కే ఎస్ రవికుమార్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు.
దర్శకుడు : హరీష్ శంకర్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రాఫర్ : అయానకా బోస్
ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్

సంబంధిత లింక్స్ :ట్రైలర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ ఉగాది కానుకగా విడుదలకి వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

Ustaad Bhagat Singh కథ:

ఒక గూడెంలో చిన్నయ్యగా పిలవబడే అనాథని ఆ ఊరి మాస్టర్ చంద్రశేఖర్ రావు (కే ఎస్ రవికుమార్) దత్తత తీసుకొని చదివిస్తారు. ఆ పసివాడు ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) (పవన్ కళ్యాణ్) గా మారిన తర్వాత ఏం చేశాడు? పేరు మోసిన తీవ్రవాది (అజ్మల్ రహీం), సీఎం కావాలని తాపత్రయం పడుతున్న నల్ల నారప్ప (ఆర్ పార్తిబన్) లు కలిసి చేసిన ప్లానింగ్ ఏంటి? వీటిని ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ఎలా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) ల ప్రాముఖ్యత ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

గబ్బర్ సింగ్ కలయికలో సినిమా అంటే ఆ హైప్ ఓ రేంజ్ లో సెట్ అయ్యింది. పవన్ అభిమానులుని మరో అభిమాని దర్శకుడు సంతృప్తి పరచాలంటే మామూలు విషయం కాదు. అది గబ్బర్ సింగ్ తో హరీష్ నెక్స్ట్ లెవెల్ డ్యూటీగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) లో కూడా పవన్ తో ప్లాన్ చేసిన సీక్వెన్స్ లు ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి.

మెయిన్ గా సెకండాఫ్ మాత్రం ఫ్యాన్ అండ్ మాస్ ఆడియెన్స్ స్టఫ్ అని చెప్పొచ్చు. పవన్ పై వింటేజ్ సాంగ్స్ తో మూమెంట్స్ చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. పైగా హరీష్ శంకర్ డిజైన్ చేసిన పలు సందర్భానుసార సన్నివేశాలు వాటిలో పాత పాటలు మిక్సింగ్ వంటివి మంచి అర్థవంతంగా అనిపిస్తాయి. వీటిలో పవర్ స్టార్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మరియు డైనమిక్ ప్రెజెన్స్ లు ఇంప్రెస్ చేస్తాయి.

తన మార్కు యాక్షన్, మాస్ మూమెంట్స్ ఇందులో ట్రీట్ ఇస్తాయి. చాలా మంది ట్రైలర్ లో చూసి పవన్ లోకి ఓజి వచ్చాడు అనుకున్నారు కానీ.. పాతబస్తీ సీక్వెన్స్ లో మాత్రం అలా గబ్బర్ సింగ్ వచ్చి వెళ్తాడు. ఈ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి మాస్ ఆడియెన్స్ కి క్రేజీ ట్రీట్ అనాల్సిందే. దీనితో పాటుగా ఫస్టాఫ్ లో రావు రమేష్ పై ట్విస్ట్, సెకండాఫ్ క్లైమాక్స్ లో కూడా డిజైన్ చేసుకున్న ట్విస్ట్ లు బాగున్నాయి.

ఇక హీరోయిన్స్ లో రాశీ ఖన్నా, శ్రీలీల ఇద్దరికి పర్ఫెక్ట్ పాత్రలు మంచి టైమింగ్ తో సెట్ చేశారు. ఫస్టాఫ్ లో రాశి ఖన్నా బాగా చేసింది. సెకండాఫ్ లో మాత్రం శ్రీలీల తన రోల్ ని చాలా బాగా చేసింది. ఇక నటుడు పార్తిబన్ విలన్ గా తన పాత్ర పరిధి మేరకు విలనిజాన్ని అందించారు. తనతో పాటుగా కే ఎస్ రవికుమార్ కి మంచి పాత్ర దక్కింది అందులో తను బాగా సెట్ అయ్యారు. ఇతర పాత్రల్లో ముఖ్య నటీనటులు అంతా బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

ఏదైతే గబ్బర్ సింగ్ సెట్ చేసిన స్టాండర్డ్స్ తో ఈ సినిమాని కూడా ఆద్యంతం ఎంజాయ్ చేయాలని థియేటర్ కి ఆడియెన్ వెళతారో వారు ఒకింత డిజప్పాయింట్ అవ్వొచ్చు. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి కానీ మిగతా కథనం అలా ఫ్లాట్ గా సాగదీతగా వెళుతున్నట్టు అనిపిస్తుంది. మెయిన్ గా ఫస్టాఫ్ లో అంత గుర్తు పెట్టుకునే సీన్స్ కూడా ఇందులో కనిపించవు.

పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఇంట్రోని ఏ లెవెల్లో ఊహించుకుంటారు. అక్కడ నుంచి సినిమా అలా నెమ్మదిగా బిల్డ్ అవుతూ వెళుతుంది కానీ మరీ అంత ఎంజాయ్ చేసేసే విధంగా అనిపించదు. అలానే డెఫినెట్ గా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఫ్యాన్స్ మిస్ అయ్యారు.

కనీసం దేవిశ్రీప్రసాద్ ఎంతవరకు చేశారో అంతవరకు స్కోర్ ఉంచినా బాగుండు అనిపిస్తుంది. ఆ ఉస్తాద్ బ్లేజ్ లో స్కోర్ కూడా లేదు. తన మ్యూజిక్ కనీసం లేకపోవడం సినిమాలో టేస్ట్ మారినట్లు అనిపిస్తుంది. వీటితో పాటుగా నటుడు పార్తిబన్ లాంటి పవర్ హౌస్ నటుణ్ణి ఇంకా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా మంచి మాస్ స్టఫ్ ని జోడించి ఉంటే బాగుండు. కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ డోస్ సరిపోయినట్టు అనిపించదు. అసలు ఏసీపీ లాంటి ఆఫీసర్, తన తోటి పోలీసులుతో హీరోయిన్ కి సెక్యూరిటీగా పంపడం ఓకే కానీ మరీ చిన్న చిన్న ఆకతాయి పనులకు కూడా అంటే అవన్నీ ఓవర్ గా ఉంటాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు బాగా తెలుస్తోంది. గ్రాండ్ సెట్స్, రియల్ లొకేషన్స్ లో షూట్స్ బాగా ప్లాన్ చేసుకున్నారు. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. థమన్ స్కోర్ జస్ట్ ఒకే అని చెప్పొచ్చు. అయనక బోస్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది.

ఇక దర్శకుడు హరీష్ శంకర్ విషయానికి వస్తే.. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తనపై ఆ ఒత్తిడి ఉంటుంది. అయితే దీనిని చాలా వరకు తను బాగానే హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశారు. రీమేక్ అనే నెగిటివిటీ నుంచి మొదటి బ్లేజ్ తోనే సమాధానం అందించారు. కానీ తనపై ఆ ఎఫెక్ట్ మాత్రం అలా కొనసాగుతూనే వచ్చింది. ఆ కామెంట్స్ కి ఉస్తాద్ తో ఒక మంచి సమాధానం ఇచ్చారని చెప్పొచ్చు.

కానీ వీరి కలయిక అంటే ఇంకా ఎక్కువ ఆశలు, అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసే తీరుని ఇంకా ఎంగేజింగ్ గా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది. బహుశా మళ్లీ గబ్బర్ సింగ్ లానే చూపించారు అనే కామెంట్స్ వస్తాయని అనుకోని ఉండొచ్చు కానీ తన మెదడుకి మరింత పదును పెట్టి పవన్ ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. తనకి ఉన్న శక్తి, పరిధిలో మాత్రం పవన్ ఇచ్చిన డేట్స్ లో మంచి అవుట్ పుట్ రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్ హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. తన మార్కు మాటలు, తూటాల్లా ఇందులో పేలాయి. కానీ ఇంకా బలమైన కథ, కథనాలు ఇందులో అవసరం ఉంది. ఇవి కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ఉగాదికి వచ్చిన “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది అలాగే మాస్ ఆడియెన్స్ కి కూడా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో అలరిస్తుంది. పవన్ నుంచి మరోసారి మంచి ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, వింటేజ్ మూమెంట్స్, యాక్షన్ ఇందులో బాగున్నాయి. కొంచెం రొటీన్ కథాకథనాలు పక్కన పెడితే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు