సందీప్ తో ‘శంభాల’ మేకర్స్.. ఈ సారి నెక్స్ట్ లెవెల్..!

సందీప్ తో ‘శంభాల’ మేకర్స్.. ఈ సారి నెక్స్ట్ లెవెల్..!

Published on Mar 21, 2026 4:02 PM IST

Sundeep-Kishan

ఆది సాయికుమార్ ‘శంభాల’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న షైనింగ్ పిక్చర్స్ బ్యానర్, మరోసారి దర్శకుడు యుగంధర్ మునితో చేతులు కలిపింది. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించనున్నారు. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

​తాజాగా విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక పక్క సింహం, మరోపక్క తోడేలు ఎదురు పడుతుండగా, మధ్యలో ఒక పురాతన ఖడ్గం మెరుస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్ ‘శక్తి మరియు విధి’ మధ్య జరిగే పోరాటాన్ని సూచిస్తోంది. “కొన్ని యుద్ధాలు ముగియవు.. కొంతమంది రాజులు మరణించరు” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాలోని గాంభీర్యాన్ని చాటి చెబుతోంది.

​ఈ చిత్రం కోసం సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ మరియు భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

తాజా వార్తలు