చరణ్, ‘ధురంధర్’ దర్శకుడు కాంబినేషన్ ఛాన్స్ ఉందా! హాట్ డిస్కషన్ మొదలు

చరణ్, ‘ధురంధర్’ దర్శకుడు కాంబినేషన్ ఛాన్స్ ఉందా! హాట్ డిస్కషన్ మొదలు

Published on Mar 21, 2026 10:32 AM IST

Ram-charan-aditya-dhar

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో చేయనున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ లైనప్ పై పెద్దగా క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా ధురంధర్ సెన్సేషన్ దర్శకుడు ఆదిత్య ధర్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందా అంటే ఉండే లానే ఉందని అభిమానులు భావిస్తున్నారు.

అయితే చరణ్ ధురంధర్ 2 ని అభినందిస్తూ దర్శకుడు ఆదిత్య వర్క్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అందుకు ఆదిత్య కూడా మిగతా స్టార్స్ తో కంటే మరింత ప్రత్యేకంగా రిప్లై అందించడంతో అభిమానుల్లో హాట్ డిస్కషన్ మొదలై కొత్త ఆశలు రేకెత్తాయి. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్లో కానీ సినిమా పడితే మాత్రం అది పాన్ ఇండియా లెవెల్లో మరో సెన్సేషన్ అవుతుంది అనే చెప్పొచ్చు. మరి మ్యాడ్ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాల్సిందే.

తాజా వార్తలు