ఓటీటీ/థియేటర్ : మార్చి చివరి వారంలో సందడి చేయబోయే సినిమాలు ఇవే..!

ఓటీటీ/థియేటర్ : మార్చి చివరి వారంలో సందడి చేయబోయే సినిమాలు ఇవే..!

Published on Mar 23, 2026 11:16 AM IST

Movies

చూస్తుండగానే మార్చి నెల చివరి వారం మొదలైంది. ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఇక ఈ వారం కూడా పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఇటు థియేటర్స్‌తో పాటు ఓటీటీ కంటెంట్ కూడా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకునేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ వారం థియేటర్లలో పలు చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వాటిలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న ‘బ్యాండ్ మేళం’ ముందు వరుసలో ఉంది. ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటిస్తున్న ‘సుయోధన’ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది. సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా తెరకెక్కిన జి.ఓ.ఏ.టి(గోట్) మార్చి 26న రిలీజ్ కానుంది. తమిళంలో తెరకెక్కిన ‘యూత్’ చిత్రం తెలుగు డబ్బింగ్ మార్చి 26న వస్తుండగా.. జీవీ ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన ‘హ్యాపీ రాజ్’ మార్చి 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక వీటితో పాటు ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఈ విధంగా ఉంది.

జియో హాట్‌స్టార్ :

ది కమ్‌బ్యాక్ (వెబ్ సిరీస్) – మార్చి 23
డేర్ డెవిల్ బోర్న్ అగైన్ 2 (వెబ్ సిరీస్) – మార్చి 24
కాట్టాన్ (తమిళ చిత్రం) – మార్చి 27

అమెజాన్ ప్రైమ్ వీడియో :

ప్రెటీ లేథల్ (మూవీ) – మార్చి 25
బైట్ (వెబ్ సిరీస్) – మార్చి 25

నెట్‌ఫ్లిక్స్ :

ది రెడ్ లైన్ (ఇంగ్లీష్) – మార్చి 26
మర్దానీ 3 (హిందీ) – మార్చి 27

తాజా వార్తలు