‘ఆదర్శ కుటుంబం’ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

‘ఆదర్శ కుటుంబం’ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Published on Mar 25, 2026 12:57 PM IST

Adarsha-Kutumbham

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో మెరిసిన వెంకటేష్, ఇప్పుడు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పట్టాలెక్కుతోంది.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇప్పటికే ఒక నెల రోజుల సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని ధృవీకరించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ చిన్న విరామంలో ఉందని, త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా సత్య, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు