అక్కడ ‘పెద్ది’ విధ్వంసం.. ఇంకాస్త ఆలస్యం..!

అక్కడ ‘పెద్ది’ విధ్వంసం.. ఇంకాస్త ఆలస్యం..!

Published on Mar 26, 2026 8:00 AM IST

Peddi 9

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ గురించి ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. షూటింగ్‌లో భాగంగా తన ఎడమ కంటికి చిన్న గాయమైనప్పటికీ, ఏమాత్రం విరామం తీసుకోకుండా చరణ్ నేటి నుండే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాను ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ శరవేగంగా పనిచేస్తోంది.

​ఇక ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ విషయంలో చిన్న మార్పు చోటుచేసుకుంది. ముందుగా రామ్ చరణ్ పుట్టినరోజైన మార్చి 27న బుకింగ్స్ ప్రారంభించాలని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీనిని ఏప్రిల్ 8, 2026కు వాయిదా వేస్తున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. అదే రోజున డి-బాక్స్, డాల్బీ సినిమా వంటి ప్రీమియం ఫార్మాట్ల బుకింగ్స్ కూడా మొదలుకానున్నాయి.

​జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. రేపు (మార్చి 27) శ్రీరామనవమి మరియు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ సర్ప్రైజ్ రాబోతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు