రాముడైనా.. హనుమగా అయినా చరణ్ డైనమిక్ ప్రెజెన్స్!

రాముడైనా.. హనుమగా అయినా చరణ్ డైనమిక్ ప్రెజెన్స్!

Published on Mar 29, 2026 11:00 PM IST

RAm charan 1

ప్రెజెంట్ ఉన్న యువ స్టార్ హీరోస్ లో ఎలాంటి పాత్రని అయినా మంచి ఈజ్ గా పుల్ చేయగలిగే తారల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. అయితే అది పీరియాడిక్ తరహా టచ్ ఉన్న రోల్స్ అయితే చరణ్ కి ఇట్టే సెట్ అయిపోతున్నాయి. రంగస్థలం నుంచి మొన్న అప్పన్న రోల్ వరకు చరణ్ తనదైన వెర్సటాలిటీ చూపించి సత్తా చాటాడు.

అయితే కొన్ని ప్రత్యేకమైన డివోషనల్ పాత్రల చర్చ వచ్చినపుడు కూడా రామ్ చరణ్ ప్రస్తావన ఒక్క తెలుగు ఆడియెన్స్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ లో వస్తుంది. అది ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) లో తన ఆరాతో శ్రీరాముని తేజస్సుతో కనిపించడం అయినా ఇప్పుడు పెద్ది లో చూసుకుంటే అదే రాముని బంటు, అరివీర బలశాలి హనుమంతుని పాత్రలా అయినా సరే రామ్ చరణ్ తనదైన డైనమిక్ ప్రెజెన్స్ లో ఇండిపోవడం ఇప్పుడు చర్చగా మారింది.

మరి ఇలాంటి పవర్ఫుల్ డివోషనల్ తరహా పాత్ర అటు రాముని పై ప్లాన్ చేసినా ఇటు భజరంగ్ పై ప్లాన్ చేసినా కూడా రామ్ చరణ్ వాటికి పూర్తి న్యాయం చేస్తాడని ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. మరి అలాంటి తరహా ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చరణ్ నుంచి ఉంటుందో లేదో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు