నా పేరు కంటే సంగీతమే నిలవాలి: ‘కార్మేని సెల్వం’ మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్

నా పేరు కంటే సంగీతమే నిలవాలి: ‘కార్మేని సెల్వం’ మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్

Published on Mar 30, 2026 8:00 AM IST

a 19

సముద్రఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో, రామ్ చక్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.

ఈ సినిమా సంగీతం విషయంలో చిత్ర బృందం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రామానుజన్ ఎంకే స్థాపించిన ‘మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ’ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సినిమా నిర్మాణ వ్యయం తగ్గించడానికి, అలాగే రాయల్టీలో సంగీతకారులందరికీ వాటా దక్కేలా “మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ (Music as a Service)” అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అందుకే ఈ చిత్రానికి ఒక వ్యక్తి పేరు కాకుండా సంస్థ పేరును మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటించడం విశేషం.

ఇప్పటికే విడుదలైన ‘అరెరె’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో వచ్చే ఈ పాటలో భావోద్వేగాలను పండించేందుకు వయోలిన్, ఫ్లూట్ బదులు ‘సారంగి’ వాయిద్యాన్ని ఉపయోగించినట్లు సంగీత దర్శకుడు రామానుజన్ తెలిపారు. “సంగీతం అనేది ఏ ఒక్కరి ప్రతిభో కాదు, అది టీమ్ వర్క్. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలి. తెలుగులో ఆనంద్, హ్యాపీ డేస్ లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయడమే నా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు