ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

Published on Mar 30, 2026 4:03 PM IST

Euphoria

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సారా అర్జున్ ప్రస్తుతం యూత్ అందరిలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం ‘యుఫోరియా’ ఫిబ్రవరి 6, 2026న విడుదలైంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయినా, మంచి కథ ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా విమర్శకులు ఈ సినిమాలోని కంటెంట్‌ను మెచ్చుకున్నారు.

ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డులు లభించాయి. నటి భూమిక చావ్లాకు ఉత్తమ సహాయ నటిగా, గుణశేఖర్‌కు ఉత్తమ కథా రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ వంటి స్టార్స్ నటించగా కాల భైరవ సంగీతాన్ని అందించాడు.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో ఏప్రిల్ 2, 2026 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

తాజా వార్తలు