యంగ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్రకటించిన నితిన్, తాజాగా నాగవంశీ నిర్మాణంలో ఒక నూతన దర్శకుల ద్వయంతో మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం చర్చల్లో ఉండగానే, ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
గతేడాది ‘ఆయ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజి కె. మణిపుత్రతో నితిన్ తన తదుపరి సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్, ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ మూడు వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లపైనే పెట్టుకున్నారు. విభిన్న జానర్లలో తెరకెక్కనున్న ఈ సినిమాలు నితిన్‌కు మళ్ళీ సాలిడ్ హిట్‌ను అందించి, బాక్సాఫీస్ వద్ద ఆయనను తిరిగి ఫామ్‌లోకి తెస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకేసారి మూడు సినిమాలను లైన్‌లో పెట్టడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


