సాలిడ్‌గా డెకాయిట్ ప్రీ-రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్..!

సాలిడ్‌గా డెకాయిట్ ప్రీ-రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్..!

Published on Apr 1, 2026 12:59 PM IST

Dacoit

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ నమోదు చేస్తోంది. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.30 కోట్లు జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. శేష్ కెరీర్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఉండే క్రేజ్ కారణంగా, ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో నైజాం ఏరియా రూ.7 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.10 కోట్లకు పైగా పలికాయి. ఓవర్సీస్ హక్కులు కూడా రూ.6.5 కోట్లకు పైగా అమ్ముడవడంతో, ఒక్క తెలుగు వెర్షన్ నుండే రూ.30 కోట్ల బిజినెస్ పూర్తయింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే తెలుగు వెర్షన్‌లో కనీసం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శేష్, ఈ చిత్రాన్ని కూడా హిందీలో భారీగా విడుదల చేస్తున్నాడు. ఈ ప్రీ-రిలీజ్ లెక్కలను బట్టి చూస్తే, ‘డెకాయిట్’ అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 10న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు