విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ సాంగ్ రిలీజ్

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ సాంగ్ రిలీజ్

Published on Apr 1, 2026 6:00 AM IST

vijay

‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ సినిమా నుంచి ‘ఇది కలనో’ అనే అందమైన మెలోడీ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. విజయ్ ఆంటోని, స్వాసికల మధ్య ఉన్న ప్రేమను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. బాలాజీ శ్రీరామ్ సంగీతం అందించిన ఈ పాటకు భాగ్యశ్రీ సాహిత్యం సమకూర్చగా.. శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హరీష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్యశ్రీ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో అజయ్, కావ్య, బాలాజీ శక్తివేల్, మునిష్ కాంత్, వినోదిని, కర్నాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే నెలలో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు