రాకా.. 18 ఏళ్లుగా నాలోనే దాచుకున్నా : అల్లు అర్జున్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్షన్.. లుక్ ఎలా ఉందంటే!

రాకా.. 18 ఏళ్లుగా నాలోనే దాచుకున్నా : అల్లు అర్జున్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్షన్.. లుక్ ఎలా ఉందంటే!

Published on Apr 8, 2026 12:22 PM IST

raaka 1

ముఖ్య అంశాలు (Key Takeaways)

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రాకా’ (Raaka) సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
  • ఈ ప్రాజెక్ట్ తన 18 ఏళ్ల కల అని, ఈ జర్నీ తనను ఎంతో మార్చేసిందని డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
  • ఇప్పటికే అనౌన్స్ చేసిన ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ అందింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ (Raaka) సినిమా నుంచి ఇంటెన్స్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బన్నీ మాస్, రగ్గడ్ లుక్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అట్లీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

18 ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్..

‘రాకా’ సినిమా తనకెంత స్పెషలో అట్లీ తన పోస్ట్‌లో ఎమోషనల్‌గా పంచుకున్నారు. “రాకా అనేది నాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నాలో ఒక భాగం. ఈ కథను 18 ఏళ్లుగా నాలోనే మోస్తున్నాను. ఈ ఐడియా ఎప్పటికీ మసకబారనివ్వలేదు. ఈ జర్నీ నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది. ఇన్ని రోజులు నాతోనే ఉంది. నిజం చెప్పాలంటే.. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేశారు.

ఇప్పటికే ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షారుఖ్ ఖాన్‌ ‘జవాన్’తో గ్లోబల్ రేంజ్‌లో హిట్టు కొట్టిన అట్లీ, ఇప్పుడు బన్నీతో కలసి ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారో అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ లైనప్ ఈ రేంజ్‌లో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు