వైరల్: గ్లోబల్ రీచ్ తో బాలయ్య సినిమా.. ఏకంగా ట్రంప్ కే వార్నింగ్!

వైరల్: గ్లోబల్ రీచ్ తో బాలయ్య సినిమా.. ఏకంగా ట్రంప్ కే వార్నింగ్!

Published on Sep 24, 2026 10:00 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేసిన సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’ కూడా ఒకటి. దీనినే రీసెంట్ గా తమిళ్ లో సీఎం విజయ్ జన నాయగన్ గా రీమేక్ చేసి రిలీజ్ కూడా చేశారు.

అయితే భగవంత్ కేసరి సినిమా రీచ్ మాత్రం ఇప్పుడు గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళింది. నిజానికి కొన్నేళ్ల కితం కూడా వెస్ట్రన్ ఆడియెన్స్ లో భగవంత్ కేసరి యాక్షన్ క్లిప్ వైరల్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అంతకు మించిన రీచ్ అని చెప్పాలి.

ఇరాన్ ఎంబెస్సి వారు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కి యుద్ధం విషయంలో బాలయ్య సీన్ రిఫరెన్స్ గా పెట్టి ఈ మధ్య మేము హాలీవుడ్ సినిమాలు బదులు బాలీవుడ్ సినిమాలు చూస్తున్నాం అంటూ షేర్ చేసిన వీడియో క్లిప్ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన బాలయ్య, నందమూరి అభిమానులు ఆనందం, గర్వం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు