వైరల్ పిక్: తన సర్దార్ గబ్బర్ సింగ్ తో డాకు మహారాజ్ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

వైరల్ పిక్: తన సర్దార్ గబ్బర్ సింగ్ తో డాకు మహారాజ్ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

Published on Apr 8, 2026 7:01 PM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. అయితే దీనికి ముందు వచ్చిన గబ్బర్ సింగ్ అందరికీ బాగా గుర్తు అయితే అయితే దాని తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ వైఫల్యం అయ్యింది కానీ రికార్డ్ ఓపెనింగ్స్ ఆ సినిమా సెట్ చేసింది. మరి ఆ సినిమా దర్శకుడు కొల్లి బాబీ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పవన్ ని కలిసిన ఫోటోలు వైరల్ గా మారాయి. పవన్ తనతో తీసిన సెల్ఫీ ఫోటోలు షేర్ చేసి ఓ ఎమోషనల్ లైన్స్ కూడా తాను షేర్ చేసుకున్నారు.

“ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం.. ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు.. రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం… కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను.. జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం.. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను.. జైహింద్.. లవ్ యు మై పవర్ స్టార్ అంటూ ముగించారు. దీనితో ఈ పిక్ మరియు పోస్ట్ లు అభిమానుల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు