‘డెకాయిట్’ కొల్లగొట్టాల్సిన టార్గెట్ ఇదే..శేష్ సినిమా సాధిస్తుందా!

‘డెకాయిట్’ కొల్లగొట్టాల్సిన టార్గెట్ ఇదే..శేష్ సినిమా సాధిస్తుందా!

Published on Apr 9, 2026 4:00 PM IST

dacoit-1

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శానియల్ డియో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే డెకాయిట్. ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సాలిడ్ బుకింగ్స్ ని కూడా తెలుగు, హిందీ మార్కెట్ లలో అందుకుంటుంది.

ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కూడా శేష్ నుంచి సాలిడ్ ట్రీట్ ని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ టార్గెట్ వసూళ్లు ఎంత అనేది ఇప్పుడు తెలుస్తోంది. దీని ప్రకారం డెకాయిట్ కి ఎలా లేదన్నా 30 కోట్ల మేర షేర్ రావాల్సి ఉందట. అంటే గ్రాస్ ఈజీగా 60 కోట్ల దగ్గరకి ఈ సినిమా రాబట్టాల్సి ఉంది.

ప్రస్తుతం అయితే బజ్ అంతా బాగానే ఉంది. ఓపెనింగ్స్ కూడా ప్రామిసింగ్ గా పడేలానే ఉన్నాయి. సో డెకాయిట్ కి జస్ట్ టాక్ పడినా టార్గెట్ ని రీచ్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించారు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు