గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.
కాగా, ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘మిరాయ్’ చిత్రం తర్వాత మనోజ్ మళ్లీ విలన్ అవతారంలో అలరించబోతుండటం, అందునా బాలకృష్ణకు విలన్‌గా ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్ ఇప్పటివరకు కనిపించని ఒక సరికొత్త మరియు భయంకరమైన లుక్‌లో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.
బాలకృష్ణ చిత్రాలలో విలన్ పాత్రలకు ఉండే ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందేనని, ఈ పాత్రకు మనోజ్ తన నటనతో మరింత పవర్‌ను తెస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


