అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?

అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?

Published on Apr 11, 2026 11:02 AM IST

Youth 2 1

తమిళ్ లో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘యూత్’ కోలీవుడ్ లో సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది.

​తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 16, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్కూల్ లైఫ్, టీనేజ్ లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఇప్పుడు నేరుగా ఓటీటీ లో వీక్షించవచ్చు.

​కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ సమ్మర్ హాలిడేస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ‘యూత్’ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు