‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

Published on Apr 11, 2026 3:57 PM IST

‘కార్తికేయ-2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘స్వయంభూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ మరియు శ్రీకర్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం నిఖిల్ గత రెండేళ్లుగా ఎంతో కష్టపడుతూ, యుద్ధ విద్యల్లో కూడా ప్రత్యేక శిక్షణ పొందాడు.

​ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్లను ఏప్రిల్ 16 నుండి ప్రారంభించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా ‘రా రా ధీవర’ అనే ఫస్ట్ సింగిల్‌ను అదే రోజున విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నిఖిల్ ఒక అడవిలో ఉగ్రరూపంతో, చేతిలో ఈటె పట్టుకుని శత్రువుపై గురిపెట్టిన యోధుడిలా కనిపిస్తున్నాడు. రవి బస్రూర్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

​ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంయుక్త మీనన్ మరియు నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు