సింగర్ మంగ్లీపై షాకింగ్ ఆరోపణలు.. కోట్లలో వ్యవహారం!?

సింగర్ మంగ్లీపై షాకింగ్ ఆరోపణలు.. కోట్లలో వ్యవహారం!?

Published on Apr 11, 2026 11:32 PM IST

mangli

తనదైన గాత్రంతో మన తెలుగు ఫోక్ సాంగ్స్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని సెట్ చేసుకున్న ఫీమేల్ సింగర్ మంగ్లీ ఇప్పుడు ఊహించని ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కి వైరల్ గా మారింది. ఇన్ని రోజులు మ్యూజికల్ పరంగా వినిపించిన ఆమె పేరు ఇప్పుడు కోట్లలో వ్యవహారంలో వినిపించడం ఒకింత ఆశ్చర్యంగా మారింది.

అయితే మంగ్లీ తన దగ్గర 10 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వమంటే బెదిరింపులు చేస్తుంది అని అడ్వకేట్ సుబ్బారావు హైదరాబాద్ లో ఇచ్చిన కంప్లైంట్ తో అసలు విషయం బయటకు వచ్చింది. ఇదే ఒకింత షాకింగ్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా వందల కోట్ల వరకు మంగ్లీపై ఆర్ధిక వ్యవహారాలు వెళ్లినట్లు వినిపిస్తోంది. దీనితో ఈ పాపులర్ సింగర్ విషయంలో ఈ ఊహించని కోణం సెన్సేషన్ గా మారింది. మరి దీనిపై మంగ్లీ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు