టాలీవుడ్ లో లేటెస్ట్ గా విడుదలైన ‘డెకాయిట్’ చిత్రంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సీతారామం, హాయ్ నాన్న సినిమాల తర్వాత మృణాల్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండటంతో, అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
అయితే, ఈ పాత్రను మొదట శృతి హాసన్ చేయాల్సింది. ఆమె కొన్ని సీన్ల షూటింగ్లో కూడా పాల్గొని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వడం, మృణాల్‌కు మంచి పేరు రావడంతో.. శృతి ఒక మంచి అవకాశాన్ని వదులుకుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుతం శృతి హాసన్ బలమైన పాత్రల కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో ‘డెకాయిట్’ వంటి సినిమా ఆమెకు కెరీర్ పరంగా పెద్ద ప్లస్ అయ్యేది. అమెరికాలో కూడా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం, శృతికి ఒక చేజారిన గొప్ప అవకాశంగా మిగిలిపోయింది.


