స్పెషల్ రోల్ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ ?

స్పెషల్ రోల్ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ ?

Published on Apr 12, 2026 9:03 AM IST

devara-2

‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. కాగా ‘దేవర పార్ట్-2’ షూట్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఉంటుందని టాక్. ఐతే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం కొరటాల శివ ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఓ తమిళ హీరోని ఎంపిక చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. ఆ హీరో విజయ్ సేతుపతి అని టాక్. ఇక ఇప్పటికే, దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ పూర్తి అయ్యాయి.

కాగా ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు