‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?

‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?

Published on Apr 13, 2026 9:00 AM IST

mangli

‘సింగర్ మంగ్లీ’ తన జానపద గీతాలతో, తెలుగు సినిమా పాటలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, రూ. 10 కోట్ల మోసం కేసులో ఆమె పేరు వినిపించడం, న్యాయవాది సుబ్బారావు మంగ్లీపై తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఐతే, దీనిపై మంగ్లీ ఇప్పటికే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి, ఆ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో మంగ్లీ, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ.. నా పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. నేను కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఈ స్థాయికి వచ్చాను. ఇతరులను మోసం చేయాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది ?, ప్రస్తుతం నాకు రెండు చేతుల నిండా పని ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది. అలాంటి నేను మరొకర్ని ఎందుకు మోసం చేస్తాను ? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరి ఎందుకు సుబ్బారావు, ఆమె పై ఆరోపణలు చేశాడు ?, అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా తన జీవితానికి ఒక శాపంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదని, ఓ వ్యక్తి ఫేమస్ అవ్వడం కోసం కేసు పెడితే.. దాన్ని నిజం అంటూ ప్రచారం చేయడం దారుణం అంటూ మంగ్లీ వాపోవడం అందర్నీ ఆలోచింపజేసింది. ఏ వార్త అయినా నిజానిజాలు తెలుసుకున్నాక ప్రచారం చేయాలని నెటిజన్లను కోరారు.

తాజా వార్తలు