రజినీకాంత్ మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్.. మరోసారి డైరెక్టర్ మార్పు..?

రజినీకాంత్ మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్.. మరోసారి డైరెక్టర్ మార్పు..?

Published on Apr 13, 2026 11:00 PM IST

Kollywood epic Multistarrer

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా మరో స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న ‘తలైవర్ 173’ చిత్రం కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కనుంది. అయితే, మొదట సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా ఆ తర్వాత సిబి చక్రవర్తి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది.

ఇప్పుడు ఈ సినిమా నుండి డైరెక్టర్ సిబి చక్రవర్తి కూడా తప్పుకున్నాడనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సిబి చక్రవర్తి ఈ సినిమా నుంచి వెళ్లిపోవడానికి సంబంధించి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ సూచించిన కొన్ని మార్పుల విషయంలో దర్శకుడికి, హీరోకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సిబి చక్రవర్తి గతంలో ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని.. సదరు నిర్మాత ‘తలైవర్ 173’లో భాగస్వామ్యం కోరగా కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అందుకు నిరాకరించిందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిబి చక్రవర్తి స్థానంలో అశ్వత్ మరిముత్తు ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఎందుకింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు