మెట్రో స్టేషన్‌లో వెంకీ మామ యాక్షన్.. త్రివిక్రమ్ స్పీడు మామూలుగా లేదుగా..!

మెట్రో స్టేషన్‌లో వెంకీ మామ యాక్షన్.. త్రివిక్రమ్ స్పీడు మామూలుగా లేదుగా..!

Published on Apr 22, 2026 4:00 PM IST

Aadarsha-Kutumbam-House

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఇండోర్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం, తాజాగా మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించింది.

ఈ సినిమాను పక్కా కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ మార్క్ వినోదం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు