‘జెన్ జీ’కి మైండ్ బ్లాక్ చేసిన పవర్ హౌస్.. మోహన్ బాబుకి ఇక ముందు కూడా ఇలాంటి రోల్స్ పడతాయా?

‘జెన్ జీ’కి మైండ్ బ్లాక్ చేసిన పవర్ హౌస్.. మోహన్ బాబుకి ఇక ముందు కూడా ఇలాంటి రోల్స్ పడతాయా?

Published on Sep 26, 2026 3:08 PM IST

టాలీవుడ్ లో దిగ్గజ నటుల్లో ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో తక్కువ సినిమాల్లోనే కనిపించారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన ప్యారడైజ్ చిత్రంతో మోహన్ బాబు పొటెన్షియల్ ఏంటి అనేది తెలుగు రాష్ట్రాలలో ఉన్న జెన్ జీ యువతికి తెలిసింది.

అప్పుడు వరకు ఏదో సోషల్ మీడియా ట్రోల్స్, ఫన్ వీడియో లతోనే తెలిసి ఉండొచ్చు కానీ మోహన్ బాబు లాంటి పవర్ హౌస్ నటుడుని సరిగ్గా వినియోగించుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపాడు. నాని ఉన్నప్పటికీ సినిమాలో పూర్తి డామినేషన్ చూపించిన మోహన్ బాబు పెర్ఫామెన్స్ కోసమే ఇప్పటికీ సోషల్ మీడియాలో యువత మాట్లాడుకుంటుంది.

ఎక్కడెక్కడ నుంచో పవర్ఫుల్ రోల్స్ ఎవరెవరినో తెచ్చుకుంటున్నాం.. కానీ మన దగ్గర ఉన్న మోహన్ బాబు లాంటి వారిని వాడుకోవట్లేదు అనే మాట ప్యారడైజ్ తర్వాత మొదలైంది. సో ఇక ప్యారడైజ్ తర్వాత నుంచి అయినా డైలాగ్ కింగ్ మోహన్ బాబుకి మన టాలీవుడ్ దర్శకులు ఈ తరహా ఇంపాక్ట్ కలిగించే పాత్రలు రాసుకొని అందిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు