దర్శకుడు భాను దర్శకత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్య సంఘటనలే ప్రధాన కథాంశంగా ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ అయ్యారు. చంద్రబాబు సామాన్యుడిగా జీవితం ప్రారంభించి, ప్రపంచం మెప్పుపొంది, దార్శనికుడిగా, సమర్థ నాయకుడిగా ఎదిగారు. ఇదే అంశాన్ని ముఖ్యంగా చంద్రబాబు ఎదిగిన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించడానికి భాను సన్నాహాలు చేస్తున్నారు.
ఎంతైనా.. చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతిఘట్టంలో ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని ఆ ఉద్వేగాల సమాహారమే ఈ బయోపిక్ అని దర్శకుడు భాను చెప్పుకొచ్చాడు. అన్నట్టు తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ ఈ సినిమాని తీస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో, భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది. ‘రాజధాని ఫైల్స్’ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.


