వారం గ్యాప్‌లో డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

వారం గ్యాప్‌లో డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

Published on Sep 25, 2026 2:00 AM IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ బాక్సాఫీస్ వద్ద రెండు భారీ ప్రాజెక్టులతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆగస్ట్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హిట్‌ సాధించినా, ఇటీవలి ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ తీవ్రంగా నిరాశపరిచింది. అయినా ఏమాత్రం తగ్గకుండా, అక్టోబర్ 9న తన సొంత నిర్మాణంలో వెంకటేష్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు, అక్టోబర్ 15న రాబోతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను కూడా నాగవంశీనే సొంతం చేసుకున్నారు. అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోటీలో ఉన్నప్పటికీ, థియేటర్ల కేటాయింపులో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. సొంత సినిమా ‘ఆదర్శ కుటుంబం’తో పాటు పంపిణీ చిత్రం ‘జైలర్ 2’ రెండూ ఘనవిజయం సాధిస్తే నాగవంశీకి బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు రావడం ఖాయం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు