హైదరాబాద్‌లోని ఆర్సీ పురంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘అనుటెక్స్’ తమ నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఏప్రిల్ 2026లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానస వారణాసి రిబ్బన్ కట్ చేసి స్టోర్‌ను ప్రారంభించారు. సంప్రదాయం, నాణ్యత, సరసమైన ధరల కలయికగా ఈ నూతన బ్రాంచ్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు సంస్థ అడుగులు వేస్తోంది.
1970లో రామకృష్ణ గారిచే స్థాపించబడిన అనుటెక్స్, 56 ఏళ్లుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ స్థానిక రిటైల్ రంగంలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ప్రస్తుతం శ్రీనివాస్, ఆయన కుమారుడు రామ్ నేతృత్వంలో సంస్థ తమ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. కోతపేట్, అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఏఎస్‌రావ్ నగర్, సుచిత్ర వంటి ప్రాంతాల్లో ఇప్పటికే విజయవంతంగా సేవలందిస్తున్న సంస్థ.. తాజాగా ఆర్సీ పురం శాఖతో తమ విస్తరణను వేగవంతం చేసింది. భవిష్యత్తులో మరిన్ని కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
కుటుంబ సభ్యులందరికీ కావాల్సిన పండుగ దుస్తులు, సంప్రదాయ, రోజువారీ వస్త్రాలను బడ్జెట్‌కు తగ్గట్లుగా (పాకెట్ ఫ్రెండ్లీ) ఒకే చోట అందించడం అనుటెక్స్ ప్రత్యేకత. ఆర్సీ పురం నూతన షోరూమ్ ప్రారంభం సందర్భంగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను సంస్థ ప్రకటించింది. తమపై ఏళ్లుగా విశ్వాసం ఉంచిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపిన యాజమాన్యం, ఈ నూతన స్టోర్‌ను సందర్శించి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.


