తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర’ ఇప్పటికే తన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ క్రమంలో ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని ట్రిడెంట్ హోటల్లో సాయంత్రం 5 గంటల నుండి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేశారు. ఈ వేడుకకు మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర యూనిట్‌కు తన మద్దతును తెలపనున్నాడు. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయరామ్, కెఎస్ రవికుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


