‘GS’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్

‘GS’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్

Published on Apr 26, 2026 6:00 AM IST

బిగ్ బాస్ విన్నర్, టాలెంటెడ్ నటుడు ఆరి అర్జునన్ ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు మరియు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఆరి అర్జునన్ హీరోగా నటిస్తూనే సుందర్ బాబు, ముత్తయ్య అళగర్స్వామి, జయ శీలన్ హెన్రీలతో కలిసి రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

​ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటిస్తూ తమిళ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. అలాగే భరత్, సునీల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండగా, అమ్ము అభిరామి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘GS’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

​కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఉత్కంఠను రేకెత్తించేలా కట్ చేసిన ట్రైలర్ చూస్తే ఇదొక ఫాస్ట్ పేస్డ్, ఎమోషనల్ యాక్షన్ సినిమా అని అర్థమవుతోంది. ఇందులో ఆరి అర్జునన్ నిజాయితీ గల పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం, విజయ్ మిల్టన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు