నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రమే ‘ది ప్యారడైజ్’. టాలీవుడ్ నుంచి చాలా కాలంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది కాగా పలు అడ్డంకులు తర్వాత ఫైనల్ గా ఈ సినిమా ఎట్టకేలకి పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా కంటే ముందే నాని హిందీ మార్కెట్ లో కూడా మెల్లగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళుతున్నాడు.
ఇక ప్యారడైజ్ తో డెఫినెట్ గా బెటర్ నెంబర్స్ ని అంతా ఆశించారు. అయితే గత సినిమా హిట్ 3 కంటే ప్యారడైజ్ చిత్రం హిందీ మార్కెట్ లో చాలా బాగా పెర్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న అప్డేట్ ప్రకారం నాని సినిమాకి 2 కోట్లకి పైగానే నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.
దీనితో గ్రాస్ ఈజీగా మూడున్నర కోట్ల మేర ఉండొచ్చు. దీనితో ప్యారడైజ్ చిత్రానికి హిందీలో మంచి స్టార్ట్ దక్కింది అనే చెప్పొచ్చు. అలాగే నాని మార్కెట్ కూడా పెరిగింది అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.


