ప్రస్తుతం అటు కోలీవుడ్ ఆడియెన్స్ సహా మన తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రమే “జైలర్ 2”. తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ పార్ట్ 2 భారీ హైప్ ని సెటప్ చేసుకుంది. గత కొన్ని రోజులు కితమే మొత్తం షూటింగ్ ని ఈ సినిమా పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది. దీనితో రజినీకాంత్ ఈ సినిమా కోసం తన ఫినిషింగ్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారట. అదే ఈ సినిమాకి తన డబ్బింగ్ ని రజిని ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నారట. సో ఇది కూడా పూర్తయితే సినిమా రిలీజ్ డేట్ కోసం కూడా త్వరలోనే ఒక క్లారిటీ రావచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ పార్ట్ లో కూడా సాలిడ్ క్యామియోలు ఉన్నాయట. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


