అటకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్.. ఇంత నీరసం గానా!

అటకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్.. ఇంత నీరసం గానా!

Published on Sep 24, 2026 6:30 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. డీసెంట్ బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకి జరుగుతున్న ప్రాసెస్ విషయంలో మాత్రం బాగా జాప్యం నెలకొనడం డిజప్పాయింట్ చేస్తుందని దగ్గుబాటి ఫ్యాన్స్ అంటున్నారు.

ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ లో కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడం మేకర్స్ వర్క్ ఎంత నీరసంగా ఉంది అనేది చూపిస్తుంది. విడుదల తేదీ మార్చారు.. మొన్నే రావాల్సిన ఫస్ట్ సింగిల్ అటకెక్కేసింది. ఇక మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుంది, వాయిదా వేసాం కొత్త డేట్ ఇది అని కూడా అనౌన్స్ చేయలేదు.

దీనిబట్టి మేకర్స్ ఈ సినిమా విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సాంగ్ ఈ వారాంతంలో రావచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు