మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సినిమా నుంచి కొత్త రిలీజ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే చరణ్ పై ఓ కొత్త పోస్టర్ అది కూడా కొత్త షేడ్ లో కనిపించనుంది అంటూ ఓ టాక్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఆల్రెడీ చరణ్ క్రికెటర్ గా కుస్తీ ఫైటర్ గా రెండు షేడ్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే.
కానీ ఈసారి బుచ్చిబాబు ప్లాన్ చేసిన మూడో స్పోర్ట్ వెర్షన్ కి సంబంధించిన లుక్ రావచ్చని రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.


