ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ ప్లాప్ కి ఓటిటి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎందులో అంటే?

ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ ప్లాప్ కి ఓటిటి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎందులో అంటే?

Published on May 1, 2026 6:55 PM IST

Love Insurance Kompany

కోలీవుడ్ వరుస విజయాల సూపర్ హిట్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఎస్ జే సూర్య విలన్ గా దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా చిత్రమే “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ గత నెల థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. కానీ ఈ చిత్రం మాత్రం ప్రదీప్ హిట్ స్ట్రీక్ కి బ్రేక్ వేసి తనకి ఫస్ట్ ప్లాప్ గా నిలిచింది.

మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ మే 6 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు ప్రైమ్ వీడియో వారు ఖరారు చేశారు. ఈ సినిమా ఒరిజినల్ తమిళ్ సహా తెలుగు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ మరియు నయనతారలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు