వైరల్: మైఖేల్ జాక్సన్ ప్లేలిస్ట్ లో మెగాస్టార్ సాంగ్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్!

వైరల్: మైఖేల్ జాక్సన్ ప్లేలిస్ట్ లో మెగాస్టార్ సాంగ్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్!

Published on May 3, 2026 10:30 PM IST

michael-jackson-chiranjeevi

ప్రపంచ పాప్ రంగంలో రారాజు మైఖేల్ జాక్సన్ భౌతికంగా ఇప్పుడు లేకపోయినా సరే మళ్ళీ మరోసారి తన రేంజ్ అంటే ఏంటో అంతా విట్నెస్ చేస్తున్నారు. తన జీవిత చరిత్రపై తన మేనల్లుడు జాఫర్ జాక్సన్ హీరోగా నటించిన చిత్రం ‘మైఖేల్’ విడుదల అయ్యి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూజిక్ ఛార్ట్స్ లో మైఖేల్ జాక్సన్ సాంగ్స్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి.

ఇలా మరోసారి గ్లోబల్ లెవెల్లో తన పేరు మారుమోగుతుండగా తన హిట్ సాంగ్స్ లో థ్రిల్లర్ అనే సాంగ్ తెలుగు ఆడియెన్స్ సహా గ్లోబల్ ఆడియెన్స్ లో కూడా వైరల్ గా మారింది. ఇది ఎందుకు కంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగ సినిమా నుంచి గోలీమార్ సాంగ్ బీట్స్ ఇంకా డాన్స్ థ్రిల్లర్ నుంచి ప్రేరణ చెంది చేసినవే. అయితే మెగాస్టార్ డాన్స్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇలా ఇండియన్ వెర్షన్ మైఖేల్ జాక్సన్ అంటూ పలు పోస్ట్ లు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు వీటి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం మరోటి వైరల్ గా మారింది. యూట్యూబ్ లో మైఖేల్ జాక్సన్ అఫీషియల్ ఛానెల్ ఉంది. అందులో ఉన్న అధికారిక ప్లే లిస్ట్ లో చిరంజీవి వెర్షన్ థ్రిల్లర్ తాలూకా విజువల్స్ కూడా ఉండడం ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ గా మారింది.

నిజానికి ఈ సాంగ్ కట్ మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడే యాడ్ చేసింది అని తెలుస్తుంది. దాదాపు 18 ఏళ్ళు వెనుకే ఈ ప్లే లిస్ట్ లో యాడ్ చేశారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో మైఖేల్ జాక్సన్ కి చిరు వెర్షన్ కూడా నచ్చింది అనే టాక్ కూడా ఉంది. దీనితో ఈ స్క్రీన్ షాట్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు