కొత్త నటీనటుల కోసం గీతా భగత్ ‘ఆరెంజ్ కాస్టింగ్’

కొత్త నటీనటుల కోసం గీతా భగత్ ‘ఆరెంజ్ కాస్టింగ్’

Published on May 4, 2026 9:00 PM IST

టాలీవుడ్‌లో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా భగత్.. సినీ పరిశ్రమలో మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై మెరవాలని కలలు కనే కొత్త నటీనటులను ప్రోత్సహించేందుకు ‘ఆరెంజ్ కాస్టింగ్’ (Orange Casting) పేరుతో ఒక ఏజెన్సీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

​సినిమా ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో తనదైన శైలిలో వ్యవహరిస్తూ, యాంకర్ సుమ తరహాలో వాక్చాతుర్యంతో గీతా భగత్ మంచి పేరు సంపాదించుకున్నారు. యాంకరింగ్‌లో బిజీగా ఉంటూనే, ఇప్పుడు కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ‘ఆరెంజ్ కాస్టింగ్’ లోగోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ ఈ ప్రయాణం ఎప్పుడో మొదలైందని ఆమె పేర్కొన్నారు.

​”కొత్త ముఖాలను, ప్రతిభావంతులను గుర్తించి వినోద రంగంలో వారికి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో అదిరిపోయే అప్‌డేట్స్ రాబోతున్నాయి” అని గీతా భగత్ వెల్లడించారు. నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పరిశ్రమ వర్గాలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు