వేల కోట్లు వస్తుందన్న ‘రాజా సాబ్’ ఇప్పుడు చిన్న సినిమానా? సప్తగిరి ఇది తగునా!

వేల కోట్లు వస్తుందన్న ‘రాజా సాబ్’ ఇప్పుడు చిన్న సినిమానా? సప్తగిరి ఇది తగునా!

Published on May 10, 2026 8:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ది రాజా సాబ్”. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి ఒక ఎంటర్టైనర్ ని అందించే ప్రయత్నం దర్శకుడు మారుతీతో బెడిసి కొట్టింది. ఇక ఇదిలా ఉండగా భారీ స్థాయిలో తెరకెక్కి ప్రభాస్ లాంటి ఇండియాస్ బిగ్ స్టార్ ఉన్న ఈ సినిమాపై ఇందులో కామెడీ రోల్ చేసిన ప్రముఖ నటుడు సప్తగిరి చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

తన నుంచి ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏమీ రాలేదని అన్నీ చిన్న సినిమాల్లోనే నటించాను అందుకే అంత గుర్తింపు రావట్లేదు అన్నట్టుగా చేసిన కామెంట్స్ ఇపుడు ప్రభాస్ అభిమానులని హర్ట్ చేసాయి. ఇదే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సప్తగిరి ఎంతో ఉద్వేగంగా రాజా సాబ్ వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు చేస్తుంది అని చెప్పింది తనకి గుర్తు లేదేమో కానీ ఖచ్చితంగా రాజా సాబ్ ని కూడా చిన్న సినిమా అని ప్రస్తావించడం సప్తగిరికి తగదని అభిమానులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా దీనిపై సప్తగిరి నుంచి ఓ క్లారిటీ రావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు