ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on May 11, 2026 9:05 AM IST

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : మే 10, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శరణ్య ప్రదీప్,
దర్శకత్వం: నిహార్ కపూర్
నిర్మాతలు: రమేష్ పుప్పాల, నిహార్ కపూర్
సంగీతం: శశాంక్ తిరుపతి
ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి
కూర్పు: మహేష్ వర్మ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే “నేను”. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

శరణ్య (శరణ్య ప్రదీప్) ఒక మామూలు మిడిల్ క్లాస్ గృహిణి, ఇంటి పనులు చూసుకోవడంతో పాటుగా ఉద్యోగం కూడా చేస్తుంది. అయితే ఆమె చాలా అణుకువగా, ఓపికగా, ఎంతో సహనంతో ఈ అన్ని బాధ్యతలూ నెట్టుకొస్తుంది. కానీ ఈ తత్వంలోనే తనని తాను మిస్సవుతుంది. మరి వాటి నుంచి ఆమె బయటకి వచ్చి తనకి నచ్చినట్టు తాను బ్రతకగలిగిందా లేక తన చుట్టూతా ఉన్నవారి కోసం మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిందా అనేవి ఇందులో అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

దాదాపు ఇందులో లైన్ చాలామందికి పర్శనల్ గా కనెక్ట్ అవ్వొచ్చు. మరీ ముఖ్యంగా ఎంతో సహనంతో ఉండే ఆడవారికి ఇది మరింత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా తన రోల్ లో శరణ్య ప్రదీప్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలిచారు. అంతే సహజమైన పెర్ఫామెన్స్ తో ఆమె తన రోల్ ని బాగా చేశారు.

అలానే ఈ చిత్రం చివరి కొన్ని నిమిషాల్లో ఆమె తనలో తానే మదనపడే సన్నివేశం ఇంకా అందులో డైలాగులు బాగున్నాయి. తనతో పాటుగా ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. అలాగే శరణ్యపై డిజైన్ చేసిన ఆఫీస్ ఫైల్స్ ఎపిసోడ్, తన కొలీగ్ తో సీన్, ఇంకా బస్సులో సీట్ సన్నివేశం వంటివి చాలా నాచురల్ గా తీసుకొని చూపించారు. ఇవి అందరికీ ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో చూపించిన లైన్ అండ్ ఎమోషన్ అందరికీ తెలిసిందే, పైగా ఈ కోణంలో ఆల్రెడీ ఎక్కడో కొన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఇవి పక్కన పెడితే కొన్ని సీన్స్ మాత్రం కొంచెం రియాలిటీకి దూరంగా ఉన్నాయా అనిపిస్తుంది. ఆఫీస్ లో ఆమె లంచ్ బాక్స్ సీన్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది.

ఎంత తోటి ఉద్యోగులు అయినా ఒకరి లంచ్ ని మరీ ఉంచకుండా తినేసి కొంచెం ఇస్తారా అనిపిస్తుంది. అలానే ఈ ట్రెండీ ప్రపంచంలో ఇంటినీ, ఇంకోపక్క ఉద్యోగం చేస్తూ నెట్టుకొస్తున్న మహిళ మరీ అంత నిస్సహాయత తన భర్త వైపు నుంచి అందుకుంటుందా అనేవి కూడా అందరికీ రుచించకపోవచ్చు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సంగీతం, కెమెరా వర్క్ బాగున్నాయి. ఎడిటింగ్ లో లంచ్ సీన్ తీసేయాల్సింది. ఇక దర్శకుడు నిహార్ కపూర్ విషయానికి వస్తే తన వర్క్ ఓ మోస్తరుగా ఓకే అనుకోవచ్చు. అందరికీ కనెక్ట్ అయ్యే లైన్ ని తీసుకున్నారు. చాలా వరకు బాగానే హ్యాండిల్ చేశారు కానీ ఇంకొన్ని సీన్స్ ని కూడా పక్కాగా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇవి మినహాయిస్తే తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘నేను’ అనే లఘు చిత్రం దాదాపు అందరికీ కనెక్ట్ అవ్వొచ్చు, ముఖ్యంగా మహిళలకి బాగా కనెక్ట్ అవుతుంది. అలానే శరణ్య తన రోల్ కి పూర్తి న్యాయం చేశారు. అయితే ఈ ప్రాసెస్ లో ఒకటీ రెండు ఎపిసోడ్స్ నిరుత్సాహపరిచినా మిగతా కథనం బాగుంది. కొంచెం రొటీన్ అనిపించినా మీలో మిమ్మల్ని చూపించే లఘు చిత్రమే ఈ ‘నేను’. సో ఈ ఎపిసోడ్ ని ట్రై చేయొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు