‘రామాయణ’ షూటింగ్‌లో జాయిన్ అయిన రకుల్.. ఆ పాత్ర కోసమే..!

‘రామాయణ’ షూటింగ్‌లో జాయిన్ అయిన రకుల్.. ఆ పాత్ర కోసమే..!

Published on May 12, 2026 11:03 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె హిందీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే, బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ‘రామాయణ’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనుంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో శూర్పణఖ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారని.. ఇప్పటికే ముంబైలో ఆమె లుక్ టెస్ట్ కూడా జరిగిందని తెలుస్తోంది. కాగా తాజాగా ఆమె తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. గ్లామరస్ రోల్స్ చేసే రకుల్ ఇలాంటి పౌరాణిక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇక ప్రస్తుతం రావణుడి పాత్రకు సంబంధించి యష్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా రిలీజ్ చేయనుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళి సమయంలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

తాజా వార్తలు