సూర్య ‘కరుప్పు’ చిత్రానికి సీఎం విజయ్ బూస్ట్..!

సూర్య ‘కరుప్పు’ చిత్రానికి సీఎం విజయ్ బూస్ట్..!

Published on May 12, 2026 9:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం మే 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం నుండి బిగ్ రిలీఫ్ లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఈ సినిమాకు ఉదయం 9 గంటల నుండే ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతినిచ్చారు. తోటి హీరోగా ఉన్న విజయ్ ఇప్పుడు సీఎంగా తమ సినిమాకు అండగా నిలవడంతో సూర్య అండ్ టీమ్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, త్రిష హీరోయిన్‌గా నటించింది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు ఇది కలిసి వచ్చే అంశం.

తమ అభిమాన హీరో విజయ్ ముఖ్యమంత్రి హోదాలో సినీ పరిశ్రమకు సహకరించడం చూసి ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. సూర్య-త్రిష క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు