ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ తో పాటుగా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. భారీ హైప్ ని సెట్ చేస్తున్న ఈ మల్టీస్పోర్ట్స్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం తాలూకా అవైటెడ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ ఈ మే 18న ముంబై వేదికగా విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆల్రెడీ ఇందుకు సన్నాహాలు కూడా మొదలు కాగా ఈ అవైటెడ్ ట్రైలర్ రన్ టైం పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం పెద్ది చిత్రం ట్రైలర్ 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో రానున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. సో రామ్ చరణ్ ర్యాంపేజ్ అంత సేపు ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఓజి, సాహో, RRR లాంటి సినిమాల సాలిడ్ ట్రైలర్ కట్స్ ని అందించిన నిఖిల్ నాదెళ్ల పెద్ది ట్రైలర్ కి కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి పెద్ది ట్రైలర్ పై మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.


