చెన్నై వరుడితో పెళ్లి.. శ్రీలీల ఏమందంటే..?

చెన్నై వరుడితో పెళ్లి.. శ్రీలీల ఏమందంటే..?

Published on May 13, 2026 5:00 PM IST

Sreeleela

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. యూత్‌లో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ వరుస ఆఫర్స్‌తో అభిమానుల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. శ్రీలీల ఓ సినిమా చేస్తుందంటే, యూత్ ఆ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడతారు అనేలా ఆమె పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా పెళ్లిపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో శ్రీలీల తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు చెన్నై అంటే చాలా ఇష్టమని.. అక్కడి అబ్బాయిలు చాలా మంచి వారని.. అక్కడ దొరికే దోశలంటే తనకు ప్రాణమని.. నయనతార లాగా తాను కూడా చెన్నై కుర్రాడితో పెళ్లి చేసుకుంటానేమో అంటూ శ్రీలీల కామెంట్ చేసింది.

ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగమ్మాయి అయిన శ్రీలీల చెన్నై వరుడిపై మనసుపడిందని.. దీంతో ఆమె త్వరలోనే చెన్నై వరుడితో పెళ్లికి సంబంధించి ఏదైనా న్యూస్ చెబుతుందేమో అని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు